Reporter -Silver Rajesh Medak.తేదీ 8-4-2024. మెదక్ వేసవిలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి—మెదక్ జిల్లా ప్రత్యేక త్రాగునీటి అధికారిని, ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలీకేరి .స్థానిక కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్, కన్నారం గ్రామాల్లో సోమవారం మెదక్ జిల్లా త్రాగునీటి ప్రత్యేక అధికారిని, ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలీ కేరి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుతో సందర్శించారు.ఈ సందర్భంగా త్రాగునీటి ప్రత్యేక అధికారిని,ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోలీ కేరి మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీటి కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందన్నారు. గ్రామాల్లో, మండలాల్లో ,మున్సిపాలిటీల్లో త్రాగునీటి ఎద్దడి లేకుండా అధికారుల చర్యలు చేపట్టాలన్నారు. త్రాగునీటి పంపిణీలో సమస్యలు ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వేసవిలో త్రాగునీటి కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో ప్రజలకు ఇబ్బంది లేకుండా త్రాగునీరు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార యంత్రాంగం, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.