Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో మనమయ విశ్వకర్మ సంఘం రామాయంపేట నూతన పట్టణ అధ్యక్షులుగా శ్రీ కమ్మరి యాదగిరి చారి గారిని సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందున ఆదివారం నాడు రామాయంపేట బిజెపి పార్టీ పట్టణ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ తరపున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ.. రామాయంపేట పట్టణ విశ్వకర్మ సంఘ అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, కొడపర్తి నరేందర్, సతీష్ రావు, లావణ్య, నిమ్మల స్వామి తదితరులు పాల్గొన్నారు.