ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర కీలకం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్రాహుల్ రాజ్

Reporter-Silver Rajesh Medak.

Date04/04/2024.
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర కీలకం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్
రాహుల్ రాజ్ **

పోలింగ్ సిబ్బంది కి పక్కా గా శిక్షణ అందించాలి

ప్రభుత్వ డిగ్రీ కళాశాల పి ఓ ,ఏ పి ఓ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన
కలెక్టర్.

ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పరిస్థితి రాహుల్ రాజ్ *అన్నారు.

గురువారం మెదక్ పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు
పి ఓ ,ఏ పి ఓ ప్రిసైడింగ్ (పి. ఓ),అసిస్టెంట్ ప్రిసైడింగ్ (ఏ.పి.ఓ)లకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ శిబిరాన్ని ఆయన సందర్శించి కొనసాగుతున్న శిక్షణ విధానాన్ని పరిశీలించారు. ఎన్నికలు నిర్వహణలో అవలంబించాల్సిన విధివిధానాలు, పోస్టల్ బ్యాలెట్ వినియోగం తదితర అంశాలపై దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ పోలింగ్ అధికారులకు ముఖ్యంగా ఈవీఎం యంత్రాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, మాక్ పోల్ నిర్వహణ, ఈవిఎం యంత్రాల పని తీరు, బాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్ ,వివి ప్యాట్ల కనెక్షన్లు, వాటి పని తీరు, మరమ్మత్తు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని

ఇట్టి శిక్షణ అధికారులకు అత్యంత ముఖ్యమని, శిక్షణ పొందు ఎన్నికల సిబ్బందికి ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవాలని, తొలి సారి శిక్షణ పొందుతున్న సిబ్బంది జాగ్రత్తగా నేర్చుకోవాలని, ఎన్నికల శిక్షణ లో భాగంగా తొలి విడత శిక్షణ ఇప్పటికే అందజేయడం జరిగిందని, మొదటి దఫా శిక్షణ నిర్వహించడం జరుగుతుందని, ఎన్నిక నిర్వహణ విధానం లో భాగం గా బ్యాలెట్, కంట్రోలింగ్ యూనిట్, వి.వి.ప్యాట్ ల అమరిక తదితర అంశాల గురించి అధికారులు సంపూర్ణ అవగాహన కలిగివుండాలని, విధి నిర్వహణలో ఉన్న అధికారులకు పోస్టల్ బ్యాలెట్ అందజేయడం జరిగిందని, శిక్షణ పొందు అధికారులు అట్టి ఓటు వినియోగానికి వీలుగా ఇక్కడే ఫెలిటిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి సి సి కెమెరా లు అమర్చడం జరిగిందని, సూచించారు.

మొదటి విడత శిక్షణ లో భాగం గా 488 మంది పి. ఓ లు, ఏ.పి. ఓ.లు శిక్షణ పొందినట్లు అధికారులు వెల్లడిస్తు రెండో విడత శిక్షణ ఈనెల 06 తేదీన శిక్షణ కొనగనున్నట్లు తెలిపారు.

ఇట్టి శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎన్నికల అధికారి జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు,sveep నోడల్ అధికారి రాజిరెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్డీవో తూప్రాన్ జై చంద్రారెడ్డి, తాసిల్దార్లు మెదక్ శ్రీనివాస్ , పాపన్నపేట లక్ష్మణ్ బాబు, హవేలీ ఘనపూర్ నారాయణ , రామాయంపేట రజని , నిజాంపేట్ సురేష్ మాస్టర్ ట్రైనర్స్ ,తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!