Reporter -Silver Rajesh Medak.
త్రాగునీటి ఎద్దడి నివారణకు గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ
వారీగా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా పగడ్బందీగా చర్యలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
గ్రామపంచాయతీ, హాబిటేషన్ల వారీగా జనాభాను గుర్తించి
ప్రణాళికలు సిద్ధం చేయడం
తాగునీరు సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వాలి
టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
9391942254
మన ఊరు మనబడి అడ్జస్టింగ్ వర్క్స్ వేగవంతం
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ద్వారా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పన .
మెదక్, ఏప్రిల్ 3, 2024
బుధవారం జిల్లా కలెక్టర్ సమావేశ హాలులో తహసిల్దార్, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీవోలు, మండల వ్యవసాయ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ జిల్లాలో త్రాగునీడి ఎద్దడి నివారణ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల పనిదినాలు, మన ఊరు మనబడి అడ్జస్టింగ్ వర్క్స్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల మానిటరింగ్, ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నింటిపై అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ సంబంధిత అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
జిల్లాలోని మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఎక్కడైనా తాగునీరు సమస్యలు ఉంటే సమాచారం ఇవ్వాలని తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో తాగునీరు సమస్యలపై వచ్చే ఫిర్యాదులు స్వీకరించేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని వెల్లడించారు.
ప్రతి గ్రామానికి 100% త్రాగునీరు అందించడం లక్ష్యంగా అధికారులు పనిచేయాలని గ్రామపంచాయతీ మున్సిపల్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని దీనికి సంబంధించి నీటి సరఫరా చేయడానికి గ్రామపంచాయతీ హాబిటేషన్స్ జనాభాను లెక్కించి తద్వారా చర్యలు చేపట్టాలని ఇంటర్నల్ బోర్వెల్ సంపులు గుర్తించాలని , వ్యవసాయ బోర్లు ఖాళీగా ఉన్న పక్షంలో రైతులు దగ్గర నుండి విల్లింగ్ తీసుకొని అందుబాటులో పెట్టుకోవాలన్నారు .
బల్క్ ఇంటర్నల్ సోర్స్, అగ్రికల్చర్, ఇవన్నీ ఉన్నా కూడా తాగు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినచో ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా గ్రామాల్లో ప్రజలకు తెలియజేసి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. ప్రజల సమన్వయం చేసుకొని ఎలాంటి ఇబ్బందులు ఉన్న మేమున్నామంటూ భరోసా ఇస్తూ త్రాగునీటి కొరతను నివారించాలన్నారు.
గ్రామపంచాయతీ కార్యదర్శులు నర్సరీలను పచ్చదనం పెంపొందించే విధంగా నిర్వహించాలని,
మన ఊరు -మనబడి అడ్జస్టింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల మనిటరింగ్ చేపట్టాలన్నారు.ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కూలీలు, గ్రామపంచాయతీ వర్కర్స్ ఉదయం 11 గంటల లోపు వారి పనిని పూర్తి చేసుకునే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సన్ స్ట్రోక్ తో ఎవరు ఇబ్బంది పడకూడదని ముఖ్యంగా 12 గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఎవరు ఎండలో తిరగద్దని అత్యవసరమైతే టోపీలు, గొడుగులు ఉపయోగించి వారి పనులను చేసుకోవాలన్నారు.
కూలీలు పని చేసే ప్రాంతాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని ఎవరికైనా డిహైడ్రేషన్ గురి అయిన పక్షంలో చల్లటి త్రాగునీరు అందించడంతోపాటు దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య,E.E మిషన్ భగీరథ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు.