బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ..
రేగడి ఘనపూర్ నలుగురు మాజీ సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ లో చేరిక
కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ నేతృత్వం లో ఎంపీ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన నేతలు
గ్రామాల అభివృద్ధి కి కృషి- చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి
(చేవెళ్ల,ఏప్రిల్ 03) : కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గ్రామాల అభివృద్ధి కి కృషి చేయనున్నట్లు చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. బుధవారం చేవెళ్ల మండలం రేగడి ఘనపూర్ గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ పార్టీ కి చెందిన నేతలు రాజీనామా చేశారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ నేతృత్వం లో రేగడి ఘనాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లు తిప్పని రాంరెడ్డి, రాయికంటి నర్సింహులు, మాజీ సర్పంచ్ షాబాద్ నర్సింహులు,మాజీ ఉప సర్పంచ్ లు బాల్ రెడ్డి, యాదయ్య,స్కూల్ చైర్మన్ కిష్టయ్య, పాండులు పార్టీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈదుల పల్లి రాములు ఆధ్వర్యంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
. ఈ సందర్బంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. రేగడి ఘనాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తానన్ని హామీ ఇచ్చారు. ఘనాపూర్ కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం తో రైతుల సంక్షేమo కోసం నిరంతరం పాటు పడతాన్నారు.మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మార్పు చేoదలన్నారు. పిల్లలు చదువు కోని భవిష్యత్తు పునాదులు బలంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమం లో పీసీబీ చైర్మన్ చింపుల సత్య నారాయణ రెడ్డి, చేవెళ్ల మాజీ సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి,పీ ఏ సీ ఎస్ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, దామర గిద్ద మాజీ సర్పంచ్ మధు సుధన్ గుప్తా,చేవెళ్ల కాంగ్రెస్ నాయకులు పాటి దామోదర్ రెడ్డి, పార్టీ నాయకులు జానమోళ్ల సత్యనారాయణ రెడ్డి,మల్లారెడ్డి,షాబాద్ నర్సింహులు,యాదిరెడ్డి,మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాంబాబు, బ్యాగరి యాదయ్య, వెంకటేష్, శ్యామ్, కృష్ణ, హరీశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
బీ ఆర్ ఎస్ కు బిగ్ షాక్
చేవెళ్ల మండలం రేగడి ఘనాపూర్ గ్రామానికి చెందిన నలుగురు మాజీ సర్పంచ్ లు, నాయకులు ముకుముడి గా బీ ఆర్ ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరడం తో ఘనపూర్ లో బీ ఆర్ ఎస్ దాదాపు గా ఖాళీ అయినట్లే అన్ని చెప్పవచ్చు. ఇంకా ఒకరి డ్డర్ ఉన్న వారు కూడా ఎంపీఎన్నికల కు వెనక ముందు బీ ఆర్ ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారని తెలుస్తుంది.
కాంగ్రెస్ లో చేరిన మీర్జ గూడ తాజా మాజీ సర్పంచ్..
మీర్జగూడ మాజీ సర్పంచ్ బీమయ్య కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ నేతృత్వం లో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మీర్జగూడ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ ఎస్ నాయకులు ఆ పార్టీ కి రాజీనామా చేసిన కాంగ్రెస్ లో చేరారు. ఈ రెండు గ్రామాల బీ ఆర్ ఎస్ నాయకులు, ప్రజలు భారీ ఎత్తున్న కాంగ్రెస్ లో చేరారు. ఆయన వెంట మీర్జగూడ కదిలింది.కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు.