Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట గొలిపర్తి ఎక్స్ రోడ్ వద్ద ఉన్న శ్రీ భవాని శంకర అన్న ప్రసాద వితరణ సేవా క్షేత్రం శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ మంగళ-నాగభూషణం చారి ఆధ్వర్యంలో బుధవారం నాడు ఓ నిరుపేద జంటకు వివాహం జరిపించారు.శాలిపేట గ్రామానికి చెందిన నర్ర ఇందిర కిష్టయ్య కనిష్ట పుత్రిక లాస్యశ్రీ తుజాల్ పూర్ గ్రామానికి చెందిన కొలుగూరి బాల లక్ష్మి – కీశే. నరసింహారెడ్డి ప్రథమ పుత్రుడు దేవేందర్ రెడ్డితో వేద పండితులు శ్రీ చౌడి రవితేజ పంతులు సమక్షంలో పార్వతి స్వయంవర హోమ వేదమంత్రాలతో మంగళ వాయిద్యాలు మ్రోగగా ఈ కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగింది.అనంతరం నాగభూషణం చారి మాట్లాడుతూ కడుపేద కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులు లేని నిరుపేద వధువులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరైనా మమ్మల్ని సంప్రదించినట్లయితే మా క్షేత్రంలో ఉచిత వివాహాలు జరిపిస్తామని పుస్తె మట్టెలు అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ వివాహ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు శమంత, రాజేశం రామాయంపేట ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.