హైదరాబాద్ స్టూడియో టీవీ 10.
కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం చందానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అన్ని రంగాలలో ముందుకు తీసుకురావాలని సోనియాగాంధీ చేపట్టి సంక్షేమ పథకాలను అందరికీ అవగాహన కలిగేలా ప్రచారం చేయాలని కోరారు. అనంతరం లలిత మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. అనంతరం జగదీశ్వర్ గౌడ్ కు శాలువాతో సన్మానించి నియామక పత్రాన్ని అందుకున్నారు.