జిల్లాలో సైబర్ వారియర్స్ టీమ్స్ ఏర్పాటు

Reporter -Silver Rajesh Medak.

తేది –01.04.2024.
జిల్లాలో సైబర్ వారియర్స్ టీమ్స్ ఏర్పాటు
సైబర్ నేరాగల్ల మోసాల బారిన పడకుండా జిల్లా ప్రజలు జాగ్రత్త వహించాలి
సైబర్ నేరాల నియంత్రణ కోసం పోలీస్ స్టేషన్ వారికి ప్రత్యేక ఫోన్ నంబర్లు
జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.

ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.మాట్లాడుతూ…పెరిగిపోతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు, తద్వారా సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్‌ శాఖ సైబర్ నేరాల నియంత్రణ కోసం సైబర్ నేర బాదితులకు మెరిగైన సేవలు అందించడానికి సైబర్ వారియర్స్ కి ఒక మొబైల్ ఫోన్ తో పాటు సిమ్ ని అందించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో జరిగే సైబర్‌ నేరాలను ఏక్కడికక్కడే నియంత్రించేందుకు పోలీస్ స్టేషన్ వారీగా ఈ విభాగాలు కృషి చేస్తాయని తెలిపారు. సైబర్ కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి నేరస్ధులను గుర్తించటం, నేరగాళ్లకు శిక్ష పడేలా చేయడం, బాధితులకు న్యాయం చేయడం అనేది సైబర్ వారియర్స్ చాలేంజ్ గా తీసుకొవాలన్నారు.

పోలీస్‌ శాఖలో నియమితులై పూర్తి స్థాయిలో టెక్నాలజీపై పట్టున్న సిబ్బందిని సైబర్‌ నేరాల నియంత్రణకు ఉపయోగించి ప్రజలకు త్వరితగతిన సేవలించేలా ఈ సైబర్ వారియర్స్ ని తయారు చేసినామని తెలిపారు.
ఈ సైబర్ వారియర్స్ సైబర్ ఆర్దిక నేరాలు, కంప్యూటర్ వైరస్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, సైబర్‌ సెక్యూరిటీ చాలెంజెస్, రిస్క్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ పాలసీ యాక్ట్, కమ్యూనికేషన్‌ వ్యవస్థ, ఇంటర్‌నెట్‌ డేటా సెంటర్, నెట్‌ వర్కింగ్‌ వ్యవస్థ, నేషనల్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్, ఇన్ఫర్మేషన్‌ ఆడిటింగ్‌ కంప్లైన్స్, ఐవోటీ, క్లిష్టమైన వెబ్‌ అప్లికేషన్స్, సెక్యూరిటీ రిస్క్స్, మొబైల్‌ అప్లికేషన్స్ సెక్యూరిటీ, సోషల్‌ మీడియా ఇన్‌ ఈ గవర్నెన్స్, ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ తదితరాలపై శిక్షణ ఇచ్చినామని అన్నారు. జిల్లా పరిధిలో 21 మంది సిబ్బందిని సైబర్ క్రైమ్ నేరాలను పరిష్కరించేందుకు కేటాయించినట్లు జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.తెలిపారు. కాబట్టి ప్రజలు సైబర్ నేరాగల్ల మోసాల బారినపడకుండా జాగ్రత్త వహించాలని జిల్లా ప్రజలను జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. కోరినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు.ఎస్.పి అడ్మిన్ శ్రీ.ఎస్.మహేందర్ గారు,సైబర్ క్రైమ్ డి.ఎస్.పి.శ్రీ.సుభాష్ చంద్ర భోస్ గారు, సైబర్ వారియర్ కానిస్టేబుల్ శ్రీ.సతీష్ గారు, కార్తీక్ గారు, సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ ల వారీగా సైబర్ వారియర్స్ ఫోన్ నంబర్స్
అల్లాదుర్గ్ – 8712657861, చేగుంట – 8712657862, కుల్చారం – 8712657863, నర్సాపూర్- 8712657864,
పాపన్నపేట – 8712657865, రామాయంపేట – 8712657866, శివ్వంపేట -8712657867, టేక్మాల్ – 8712657868, తూప్రాన్ – 8712657869, హవేళిఘణాపూర్ – 8712657970, నార్సింగి – 8712657971, నిజాంపేట్ – 8712657972, మనోహరాబాద్ – 8712657973, వెల్దుర్తి – 8712657974, చిలిపిచెడ్ – 8712657975, కౌడిపల్లి – 8712657976, రేగోడ్ – 8712657977, మెదక్ టౌన్ – 8712657978, మెదక్ రూరల్ – 8712657979, పెద్ద శంకరంపేట – 8712657980, చిన్నశంకరంపేట – 8712666266.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!