Reporter -Silver Rajesh Medak.
తేదీ1-4-2024
మెదక్
వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి. అదనపు కలెక్టర్ (రెవెన్యూ )వేంకటేశ్వర్లు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి.
ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలి. జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు( రెవెన్యూ) అధికారులను ఆదేశించారు.రబీ సీజన్ (2023-24) ధాన్యం కొనుగోళ్ల సజావుగా నిర్వహించాలన్నారు . హవేలీ ఘనపూర్ మండలంలోని కొత్తపల్లి ,రాజాపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా టెంట్లు, తాగు నీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని సూచించారు. నిర్దేశించిన బరువుకంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ తూకం చేయవద్దని ఆయన స్పష్టం చేశారు.
మద్దతు ధరకే విక్రయించాలి రైతులు తాము కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకుని,నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూకేంద్రాలకు తరలించాలని సూచించారు. నిబంధనల మేరకు రైతులు తమ ధాన్యాన్ని శుభ్రంగా తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని సూచించారు.
రైతులకు టోకెన్లు ఇవ్వాలని, దాని ప్రకారం కొనుగోళ్లు చేయాలని సూచించారు. ఈ సారి ఐరిస్ యంత్రాలు కూడా పంపిస్తామని, ధాన్యం కొనుగోలు చేసినప్పుడు రైతు ఐరిస్ కూడా తీసుకోవాలని సూచించారు.
ఆయా కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులు కొనుగోళ్లు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. అందుబాటులో పరికరాలు జిల్లాలో అవసరం మేరకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని అదనపు వెంకటేశ్వర్లు వెల్లడించారు. టార్పాలిన్లు ,తూకం వేసే యంత్రాలు ప్యాడీ క్లీనర్లు, తేమ శాతం చూసే మెషిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.