-డిఎస్పి రవీంద్రనాథ్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 31, మహానంది;
ఎన్నికల నేపథ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నంద్యాల డిఎస్పి రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహానంది మండలం గాజులపల్లె గ్రామ పరిధిలోని ఆంజనేయపురం చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరిమితికి మించి నగదు తీసుకెళ్లరాదని, ఒకవేళ తీసుకెళ్లిన అందుకు తగ్గ ఆధారాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అక్రమంగా మధ్యాన్ని తరలించడం నేరమని, చెక్ పోస్ట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం, నగదు, ప్రోత్సాహక బహుమతులను తరలించే అవకాశం ఉందని, నిఘా పెట్టి పూర్తిగా కట్టడి చేయాలన్నారు. అనంతరం చెక్పోస్ట్ వద్ద పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో నంద్యాల రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్రప్రసాద్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.