వడ్డెరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తా: జరిపేటి జైపాల్ హామీ:
హైదరాబాద్ స్టూడియో 10 ప్రతినిధి: తెలంగాణ వడ్డెర సంఘం.చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి అయిలమల్లు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తరి గణేష్, రాష్ట్ర వైస్ చైర్మన్ కుంచపు దేవరాజ్,రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముద్దంగుల చెన్నయ్య,వనపర్తి జిల్లా అధ్యక్షుడు పసుపుల రామస్వామి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షుడు శంతల గోపాల్,మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కోశాధికారి డేరంగుల బాలస్వామి, వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పసుపుల మధు, జిల్లా ఉపాధ్యక్షుడు వల్లపు శాంతాన్ని,దేవరకద్ర నియోజకవర్గం అధ్యక్షుడు కుంచపు కృష్ణ, వనపర్తి నియోజకవర్గం అధ్యక్షుడు ముద్దంగుల శీను, వనపర్తి మండల అధ్యక్షుడు పల్లపు శివశంకర్, వనపర్తి టౌన్ అధ్యక్షుడు కుంచపు గోపాల్,వనపర్తి మండల యూత్ అధ్యక్షుడు కాశి, వనపర్తి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రామచందర్, ముఖ్య అతిథులు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో వడ్డెరలు ప్రభుత్వ పథకాలకు నోచుకోలేక పల్లడిల్లుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలు వారికి అందేలా చూడాలని కోరారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ చైర్మన్ జరిపాటి జయపాల్ ను ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో వడ్డెర కులస్తులను ఆదుకుంటానని వారికి హామీ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల వడ్డెర సంఘం నాయకులు అభిమానులు పాల్గొన్నారు. అనంతరం పార్లమెంట్ మాజీ ఎంపీ మల్లు రవికి వడ్డెరల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.