దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శారద ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన రామాయంపేట మండల బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ టైటానిక్ నావ లాంటిదని అది నావలాగా సముద్రంలో మునిగిపోతుందని ఆయన అన్నారు. మెదక్ జిల్లాలో కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులే పెట్టుబడిగా కబ్జాలే ఆస్తులుగా కాళ్ళు మొక్కుడే ఇంకో పెట్టుబడిగా వీరు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాయకులు రాబోతున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. గతంలో మెదక్ నియోజకవర్గం నుండి బిజెపి ఎంపీగా నరేంద్ర పోటీ చేసి గెలుపొందిన దాఖలాలు తప్ప ఇప్పటివరకు ఎవరు గెలుపొందలేరని ఆయన పేర్కొన్నారు.దేశంలో బిజెపి నరేంద్ర మోడీ నాయకత్వాన ముందుకు నడుస్తుందని ప్రతి ఒక్క కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి మెదక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఎంపీగా గెలిపించి మెదక్ నియోజకవర్గంపై బిజెపి జెండా ఎగరవేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్,నందా రెడ్డి,సుధాకర్ రెడ్డి,మండల బిజెపి పట్టణ అధ్యక్షుడు భానుచందర్, బిజెపి సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, కోడపర్తి నరేందర్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.