Date -7/3/2024.
ఈరోజు జరిగిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సర గణితం శాస్రం-IIB, జంతు శాస్రం-II, చరిత్ర -IIపరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. రెండవ సంవత్సర పరీక్షలలో జనరల్ విభాగం లో 4020గాను 3890 విద్యార్థులు హాజరైనారు. ఒకేషనల్ విభాగంలో 540 గాను 518 విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. జిల్లాలో ఈ రోజు హాజరు శాతం 97 % గా నమోదైంది. ఈ సంవత్సరం కూడా నిమిషం నిబంధన అమలు లో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాల కు చేరుకున్నారు. జిల్లాలో ఉన్న తూప్రాన్ లోని -4 కేంద్రాలను విద్యాధికారి సత్యనారాయణ, కౌడిపల్లి , నర్సాపూర్ లోని – 4 కేంద్రాలను జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, జిల్లా లో ఉన్న మెదక్ లోని -6 కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం పర్యవేక్షించారు.