శాఖల వారీగా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకొని
తద్వారా అభివృద్ధి కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో అమలు పరిచిన పక్షంలో సత్ఫలితాలు సాధ్యపడతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.*
బుధవారం కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ రాజ్ అధికారులతో శాఖల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శాఖ పైన నాకు సమగ్ర అవగాహన కలిగి ఉన్నదని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాలని ఇందుకు గాను టీం వర్క్ గా పని చేయాలని, డి.ఆర్.డి. ఓ., జడ్పీ. సీ.ఈవో, డి.పి.ఓ, డీ.ఈ.వో, డి.ఎం.హెచ్ ఓ, జిల్లా సంక్షేమ శాఖ, ఈ శాఖలతోపాటు ప్రాధాన్యత ఉన్న శాఖలు అందరూ సమగ్ర కార్యాచరణతో ఈ నెల 15 వరకు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
టీం వర్క్ బిల్డప్ చేసుకుని పాలన అందించాలని చెప్పారు. అవినీతిరహిత పాలనే లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ముందు ముందు ప్రతి డిపార్ట్మెంట్ వారీగా రివ్యూ నిర్వహించడం జరుగుతుందని ఆ రివ్యూలో అధికారులతో పాటు సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించడం జరుగుతుందని అభివృద్ధిలో అలసత్వం వహించిన ఎటువంటి అధికారులనైనా ఉపేక్షించేది లేదని అన్నారు.
జిల్లా పంచాయతీ శాఖ ద్వారా గ్రామాలలో పారిశుధ్యం పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దీనితో పాటు విద్యా, వైద్యం ప్రాధాన్యత నివ్వాలని, వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు సూచనలు అందించాలని, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించాలని అందించిన రుణాలతో ఆర్థిక అభివృద్ధి సాధించే పథకాలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. గత సంవత్సరంలో టార్గెట్ అచీవ్మెంట్, బెరీ జూ వేసుకోవాలని గత ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల పురోగతి ఈ సంవత్సరం చేయవలసిన
టార్గెట్ సాధించేందుకు కార్యచరణపై దృష్టి సారించాలన్నారు. ఒక వారంలో అధికారులతో మళ్ళీ మీటింగ్ నిర్వహిస్తానని చెప్పారు. అన్ని రంగాలలో మెదక్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపువచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం ఎంపీడీవోలతో మాట్లాడుతూ ప్రజాపాలన లో వచ్చిన దరఖాస్తుల పై దృష్టి సారించాలన్నారు.
రేషన్ కార్డు ఉన్న లబ్ధి దారులను డేటా సరిచూడాలన్నారు.
నూతన దరఖాస్తుదారుల కు ప్రతి అంశంపై అవగాహన కల్పించాలన్నారు.
మండల అభివృద్ధిలో ఎంపీడీవోల పత్ర కీలకమన్నారు పచ్చదనం పరిశుభ్రత ,నర్సరీలపై గ్రామపంచాయతీ కార్యదర్శులతో ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ఆదర్శ గ్రామపంచాయతీలు కావలసిన మౌలిక వసతులు పై దృష్టి సారించాలన్నారు.
మండలాన్ని ఒక గ్రామపంచాయతీని తీసుకొని అక్టోబర్ రెండవ తేదీ వరకు ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలనీ పేర్కొన్నారు.
మండలాల అభివృద్ధికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. పట్టణ ప్రాంతాలలో అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాని గ్రామస్థాయిలో అమలుపరచాలన్నారు.
ఈ నెల 15 తారీకు లోపు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారుచేసి అందించాలన్నారు.
ప్లాస్టిక్ రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని ప్లాస్టిక్ రహిత మెదక్ జిల్లాను కలెక్టర్ కార్యాలయం నుంచే శ్రీకారం చుట్టాలన్నారు.
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, అధికారులు ప్రజలతో సమక్యమై ప్రజల అవసరాలను గుర్తించాలన్నారు. మెదక్ జిల్లాకు ఈ వేసవి కాలానికి సంబంధించి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు. గ్రామాలలో రోడ్లు పచ్చదనం పరిశుభ్రత ఆరోగ్యం లపై దృష్టి సారించి గ్రామస్థాయి నుంచి ప్రజలను అభివృద్ధి పరచాలన్నారు. ఉపాధి హామీ పని దినాలు పెంచాలని, ఉపాధి హామీలో పనులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ధరణి పై తహసిల్దార్లతో సమావేశమై
ఆయన మాట్లాడుతూ భూ సమస్యలకు పరిష్కారానికి ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాలను వివరిస్తూ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ధరణి సమస్యలపై స్పెషల్ డ్రైవ్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు అదరపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి.ఆర్.డి.ఏ. పి.డి. శ్రీనివాస రావు, డి.సి.హెచ్.ఓ. పి.చంద్రశేఖర్, ఏడి మైన్స్ జయరాజ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఇతర శాఖల అధికారులు, తహసిల్దార్లు, ఎం.పి.డి.ఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.