చేవెళ్ల మండల కేంద్రంలోని చేవెళ్ల గ్రామపంచాయతీ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు యువకులు కేరింతలతో ఘనంగా బోనాల ఊరేగింపు జరిగింది. మహిళా భక్తులు బోనాలతో ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ఊరూవాడా చల్లగా ఉండాలని వర్షాలు కురిపించి ప్రజలను పశు పక్షాలను సుఖసంతోషాలతో ఉండేవిధంగా చూడు తల్లీ అంటూ ప్రార్థిస్తూ ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.