మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ ఉపసర్పంచ్ ఆంజనేయులును తన సొంత అన్న సత్యనారాయణ రాడుతో కొట్టి పొలం వద్ద దారుణంగా హత్య చేశాడు.ఉదయం పొలం వద్దకు వెళ్లిన ఉప సర్పంచ్ ఆంజనేయులుపై తన సొంత అన్న దాడి చేయడంతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందాడు. భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య గత రెండు సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న రామాయంపేట సిఐ. లక్ష్మి బాబు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.