Reporter-Silver Rajesh Medak.
తేదీ 20 -12-2023
మెదక్ జిల్లా,
బుధవారం
పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేయాలి… రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్
రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ జాబితా తయారీ తో పాటు ఎన్నికల పకడ్బందీ నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ను హైదరాబాద్ సి ఈ ఓ కార్యాలయము నుండి నిర్వహించారు.
మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు వేంకటేశ్వర్లు, డి ఆర్ ఓ పద్మశ్రీ , మెదక్ ఆర్డీఓ రాజేశ్వర్,నర్సాపూర్ ఆర్డీఓ శ్రీనివాస్ హాజరైనారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, మరి కొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికలకు ఓటర్ల జాబితా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. 2024 జనవరి 1 వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారందరు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా విస్తృత చర్యలు చేపట్టాలని అన్నారు. జాబితాలో తప్పులు లేకుండా చూడాలన్నారు. 18 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు అయ్యే విధంగా చూడాలన్నారు. ఇందు కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, మార్పులు చేర్పులు చిరునామా మారిన వారు చేసుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగ సూపరింటెంట్ హర్డిప్ సింగ్, మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్ లు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.