దుబ్బాక నియోజకవర్గం లో ఆర్ అండ్ బి రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు నూతన రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ అండ్ బి శాఖ అధికారులను మంగళవారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు నియోజకవర్గంలోని మంజూరైన రోడ్ల అభివృద్ధి పనులను అలాగే కొత్త రోడ్ల మంజూరు కోసం అధికారులతో సమీక్ష నిర్వహించారు దశలవారీగా నియోజకవర్గంలో రోడ్ల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు