16 డిసెంబర్, తెలంగాణ : జనహిత సేవ ట్రస్ట్ అధ్వర్యంలో లయన్స్ క్లబ్ హైదరాబాద్ వారి సహకారంతో సరస్వతి నగర్ ,సైదాబాద్ లోని సరస్వతి శిశు మందిరం అవరణలో శనివారం నిర్వహించిన వైద్య శిబిరం విజయవంతం అయ్యింది. ఈ వైద్య శిబిరం ను కార్పొరేటర్ శ్రీమతి శ్వేత మధుకర్ రెడ్డి ప్రారంభించారు.. ఈ వైద్య శిబిరం లో అపోలో, యశోద, వాసవి ఆసుపత్రుల వైద్య బృందం జనరల్ పరీక్షలు, కంటి పరీక్షలు, గైనిక్ పరీక్షలు చిన్న పిల్లల కు సంబంధించిన సమస్యలు, RBS, BP, HG, ECG, 2D ఎకో, పరీక్షలను ప్రజలకు నిర్వహించారు. మొత్తం 936 మంది హాజరయ్యారు.వీరికి ఉచితంగా మందులను పంపిణీ చెయ్యడం జరిగింది.. జనహిత ట్రస్ట్ సభ్యులు నరసింహ మూర్తి,నంద కుమార్ లు ఈ సందర్భంగా మాట్లాడుతూ జన హిత ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.చలికాలంలో వ్యాపిస్తున్న వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. జనహిత ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉమా మహేశ్వర రావు ఐఏఎస్, విద్వాన్ రెడ్డి లు మాట్లాడుతూ.. జనహిత సేవ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గురించి వివరిస్తూ ట్రస్ట్ సభ్యులను ప్రశంసించారు.