మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ లింబాద్రి ఆధ్వర్యంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నేడు మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న ఆరోగ్యశ్రీ రెట్టింపు చేస్తూ రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయల వరకు నిరుపేద ప్రజలకు వైద్యం అందించే ప్రక్రియను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ లింబాద్రి,మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ మణికంఠ, డాక్టర్ సుప్రియ,ఆస్పత్రి సిబ్బంది జయలక్ష్మి, మరియ, సరోజ, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.