Reporter -Silver Rajesh Medak.
తేది: 11-12-2023
మెదక్
స్థానిక, పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్, జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.
సోమవారం ఐడిఓసి లోని .వీడియో కాన్ఫరెన్స్ హాల్లో , త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఎన్నికల నిర్వహణకు, యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ లను ఆదేశించారు. ఈ.వి.ఎమ్. లు, వి.వి.ప్యాట్ లు వేరు వేరుగా ఏర్పాటు చేసి మరొకసారి చెకింగ్ చేపట్టాలని, ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. 2024, జనవరి 1 వ తేదీని దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా సవరింపులో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై పక్క ప్రణాళిక తో ఉండాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొని మాట్లాడుతూ.. ఓటరు జాబితాను మరోసారి సమగ్రంగా పరిశీలిస్తామన్నారు. తొలగించిన ఓటర్ల వివరాలు సమగ్రంగా ఇంటింటి సర్వే చేపట్టి పరిశీలిస్తామన్నారు. డూబ్లికేట్ ఓటర్లు తొలగింప చేసేందుకు చర్యలు తీసుకుంటామని, 100 సంవత్సరాలు దాటిన ఓటర్లను మరొకసారి పరిశీలిస్తామన్నారు. మృతుల ఓటర్ల నమోదును రిజిస్టర్ ల వారీగా పరిశీలించి సాక్ష్యాలు సేకరించి, యదార్ధమని నిర్ధారించుకున్న తర్వాతనే తొలగింప చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్సు లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మెదక్, నర్సాపూర్ తహసీల్దార్ లు శ్రీనివాస్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.