తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి అభివృద్ధి పథంలో నడిపించనున్న అభివృద్ధి ప్రదాత సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అన్నారు ఈ మేరకు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ అనుకున్న విధంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోనియాగాంధీ ప్రత్యేక చొరవ తీసుకుందని అన్నారు ముఖ్యంగా ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారని అన్నారు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా ప్రజల్లో మరింత ఊపును తీసుకొచ్చారని అన్నారు రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందడం ఖాయమని అన్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజు ఆరోగ్యశ్రీ కింద పది లక్షల ఉచిత వైద్య సహాయం పై సంతకం చేయడం హర్షాత్రేకరణం అన్నారు. రాబోయే రోజులలో తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం పాగా వేయడం ఖాయమన్నారు .ఈ మేరకు పార్టీ కార్యకర్తలు ఆయా సంఘాల అధ్యక్షులు ప్రధాన నాయకులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ మండల అధ్యక్షుడు చాంద్ పాషా, ములుగు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతనిపుల బిక్షపతి, ఎంపీటీసీ మావురపు తిరుపతిరెడ్డి షకీల్ పాషా కాసిం దేవి పేట సర్పంచ్ అహ్మద్ పాషా, నాయకులు పల్లె జయపాల్ రెడ్డి నేటి శ్యామ్ గందే శ్రీను వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెళ్ళ భరత్ అశోక్ ఇమ్మడి రాజు పవడాల ఓం ప్రకాష్ బొంతల వేణు తదితరులు పాల్గొన్నారు.