చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని రామచంద్ర రోడ్డులో నీలమ్మ మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త నాగరాజు ఇబ్బంది పెట్టేవాడు. ఈక్రమంలో 2016 ఫిబ్రవరి 5న భర్త నిద్రిస్తున్న సమయంలో తాడు బిగించి ఆమె హతమార్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. నేరాలు కోర్టులో సమర్పించడంతో భార్యకు చిత్తూరు మొదటి ADJ కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది.