జ్యోతిబాపూలే ప్రజా భవన్ పేరు నామకరణం చేసిన ముఖ్యమంత్రి వర్యులకు మెదక్ జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు మెట్టు గంగారాం కృతజ్ఞతలు… మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నివసించే అధికార నివాస మైనటువంటి ప్రగతి భవన్ అనే పేరును తొలగించి శ్రీ సంఘసంస్కర్త జ్యోతిబాపూలే ప్రజా భవన్ అనే పేరును నామకరణం చేసిన తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ జ్యోతిబాపూలే పేరు పెట్టడమే కాకుండా పూలే ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చెపట్టిన రోజే బీసీల ఆరాధ్య దైవం అయినటువంటి జ్యోతిబాపూలే పేరు తన అధికార నివాసానికి పెట్టడం శుభ పరిణామం అని మెదక్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట రామాయంపేట మండల అధ్యక్షుడు ఉత్త రాజేష్, మెదక్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి సిద్ధరాములు ఉన్నారు.