బాత్రూంలో కాలు జారి పడిపోయిన కేసీఆర్… తుంటికి గాయం.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖరరావు కాలికి గాయం అయింది. ప్రస్తుతం ఆయన సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత అర్ధరాత్రి సమయంలో ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఆయన కాలుజారి కిందపడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్టు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం పదకొండు గంటలకు శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్స్ వేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. తుంటి బాల్ డ్యామేజ్ అయినట్లు వైద్య బృందం గుర్తించింది. హాస్పిటల్‌లో కేసీఆర్ వెంట కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!