Reporter -Silver Rajesh Medak.
జిల్లా పోలీసు కార్యాలయం,
మెదక్ జిల్లా.
27.11.2023.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమిస్తే కఠిన చర్యలు: శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్
మెదక్ జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ మాట్లాడుతూ…. పోలింగ్ 48 గంటల ముందు రాజకీయ ఉద్దేశంతో కూడిన బల్క్ సంక్షిప్త సందేశాలు ఎస్ఎంఎస్ (SMS) మరియు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ సందేశాలు పంపే వారిపై అలాగే దుర్వినియోగం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారు అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమాలు మరియు ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమ నిబంధనలను ఉల్లంఘించే విధంగా పోలింగ్ కు 48 గంటల ముందు ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసే విధంగా ఎవరైనా రాజకీయ ఉద్దేశంతో కూడిన బల్క్ ఎస్ఎంఎస్ (SMS) లు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా అభ్యంతరకరమైన సందేశాలు ప్రసారం చేసే వారిపై జిల్లాలో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ ఉద్దేశంతో కూడిన బల్క్ ఎస్ఎంఎస్ (SMS)లు పంపిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టే వారి వివరాలను వెంటనే జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ల్యాండ్ నెంబర్ 08452-223533,మొబైల్ నెంబర్ 8712657888 కు కాల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సమాచారం అందించాలని అలాగే పోలింగ్ 48 గంటల ముందు ఎవరు కూడా ఏలాంటి రాజకీయ ఉద్దేశంతో కూడిన బల్క్ ఎస్ఎంఎస్లు పంపకూడదని అన్నారు అలా పంపిన వారిపై ఎన్నికల ప్రవర్తన నియమాలు ప్రకారం ఐ.పి.సి.,ఆర్.పి ఆక్ట్ సెక్షన్ 126 ఎన్నికల ప్రవర్తన నియమావళి 1961 ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మరియు జిల్లాలో ఎన్నికలు స్వేచ్చగా శాంతియుతంగా సమిష్టి సమన్వయంతో అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.