మహిళా సంక్షేమం తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యం
-మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
స్టూడియో 10 టివీ న్యూస్, నవంబర్ 23, మహానంది:
రాష్ట్రంలో మహిళా సంక్షేమం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని కొత్త కొట్టాలలో రెండవ రోజు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇంటింటికి తిరిగి మహిళలకు, ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడుప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని, నాడు మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయటం జరిగిందని, ఆస్తిలో సమాన హక్కు, రాజకీయాలలో అవకాశాలు కల్పించడం తెలుగుదేశంతోనే సాధ్యమైందని గుర్తు చేశారు.చంద్రబాబు అధికారం లోకి రాగానే 18 ఏళ్లు నిండిన ప్రతి సోదరికి ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, తల్లికి వందనం పథకం కింద చదువుకునే పిల్లలందరికీ రూ.15 వేలు అందించనున్నారని తెలిపారు. అలాగే మహిళలకు దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ప్రతి ఏడాది రూ.20 వేలు, నిరుద్యోగ యువతకు భృతి రూ.3 వేలు అందించనున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి, ఆర్ఎస్ గాజులపల్లె సర్పంచ్ అస్లాం భాష, గాజులపల్లె మహేశ్వర్ రెడ్డి,శశికళ కొండా రెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ పాణ్యం ప్రసాద్ రావు, మాజీ ఎంపిటిసి దస్తగిరి, జనార్ధన్ రెడ్డి,మౌళిశ్వర రెడ్డి, కృష్ణుడు, మహేశ్వర్ రెడ్డి, పాములేటి, మాబు, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.