చంద్రబాబుతోనే రాష్ట్రంలో ప్రజల భవిష్యతుకు గ్యారెంటీ

చంద్రబాబుతోనే రాష్ట్రంలో ప్రజల భవిష్యతుకు గ్యారెంటీ

-మాజి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి

స్టూడియో 10 టివీ న్యూస్, నవంబర్ 22, మహానంది:

తెదేపా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రంలో ప్రజలందరికీ భవిష్యతుకు గ్యారెంటీ అని శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రజలకు టిడిపి మినిమేనిఫెస్టో గురించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అధికారం లోకి రాగానే 18 ఏళ్లు నిండిన ప్రతి సోదరికి ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, తల్లికి వందనం పథకం కింద చదువుకునే పిల్లలందరికీ రూ.15 వేలు అందించనున్నారని తెలిపారు. అలాగే మహిళలకు దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ప్రతి ఏడాది రూ.20 వేలు, నిరుద్యోగ యువతకు భృతి రూ.3 వేలు అందించనున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బన్నూరు రామలింగారెడ్డి, మండల అధ్యక్షుడు ఉల్లి మధు, ఆర్ఎస్ గాజులపల్లె సర్పంచ్ అస్లాం భాష, గాజులపల్లె మహేశ్వర్ రెడ్డి,శశికళ కొండా రెడ్డి, జనార్ధన్ రెడ్డి,మౌళిశ్వర రెడ్డి టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!