క్రిష్ణా జిల్లా అవనిగడ్డ మండలం స్టూడియో 10 టీవీ న్యూస్
సిటీకేబుల్ రిపోర్టర్ కళ్ళేపల్లి చంద్ర
కుటుంబాన్ని ఆదుకోవాలని స్పందనలో జిల్లా కలెక్టర్ కు దివిసీమ జర్నలిస్టులు వినతి
అవనిగడ్డ:
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఈనెల 13వ తేదీన చల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద చల్లపల్లికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కళ్ళేపల్లి చంద్ర ఈ నెల 13 బా తేదీన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం చాలా భాధాకరం. తన కుమారుడి చదువుకోసం హాస్టల్ ఫీజు చెల్లించలేక ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. చంద్ర మరణం వల్ల ఆ కుటుంబం దిక్కులేనివారయ్యారు. గత 16 సంవత్సరాలుగా అవనిగడ్డ నియోజకవర్గంలో సిటీకేబుల్ రిపోర్టర్గా చంద్ర ఎన్నో సేవలు అందించారు. ప్రభుత్వం తరుపున అతనికి జర్నలిస్ట్ గుర్తింపు కార్డు అయిన అక్రిడేషన్లు ఉన్నాయి. ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న ఒక జర్నలిస్ట్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్య చేసుకోవడం విచారకం. కావున చంద్ర కుటుంబానికి ప్రభుత్వం తరుపున ఆర్ధిక సహాయం అందించేందుకు, ఇద్దరు పిల్లలకు చదువుకు సహాయసహకారాలు అందించాలని, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని మచిలీపట్నం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబుకి దివిసీమ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తరుపున వినతిపత్రం సమర్పించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చంద్ర పిల్లల చదువుకు సహాయ పడాలని, చంద్ర భార్యకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని కోరగా తగిన న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దివిసీమ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పుట్టి శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు దివి సారంగపాణి అయ్యంగార్, పెనుమాక సద్గునరావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు సిహెచ్ రమేష్, సింహాద్రి జయరాం, ఆర్. సుబ్రహ్మణ్యం, జొన్నా రవిశంకర్, పెన్ నాయకులు అప్పికట్ల శ్రీనివాసరావు, ఏపీయూడబ్ల్యూజేఎఫ్ నాయకులు కోట యూరిగాగారిన్, అసోసియేషన్ నాయకులు నాంచారయ్య, కల్యాణ్, రామారావు పాల్గొన్నారు.