క్రిష్ణా జిల్లా కోడూరు మండలం స్టూడియో 10 టీవీ న్యూస్
కోడూరు మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో అసంపూర్తి నిర్మాణంలో ఉన్న సచివాలయ ,ఆర్ బి కే భవనాలను వెంటనే పూర్తిచేయాలని కోడూరు మండల టిడిపి అధ్యక్షులు బండే శ్రీనివాసరావు కోరారు.
సోమవారం కోడూరు మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్ శ్రీనివాస్ కు వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా ఈ విషయంపై గ్రామస్తులు పలుమార్లు సంబంధింత అధికారులకు తెలియపరచినా పట్టించుకోవడంలేదన్నారు.
భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో నిర్మాణ ప్రదేశం అంతా ముళ్ళపోదలతో నిండి బిల్డింగ్ పిల్లర్ల ఇనుము తుప్పు పట్టి శిధిలావస్థకు చేరుతున్నాయని తెలిపారు.
ఆదివారం రామకృష్ణాపురం గ్రామంలో పర్యటించిన మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ కు పలువురు గ్రామస్తులు సచివాలయ ఆర్ బి కే భవనాలు పూర్తి చేయకుండానే కాంట్రాక్టర్ బిల్లు చేసుకున్నారని తెలిపారన్నారు.
కావున సంబంధిత అధికారులు ఈ విషయాన్ని స్వయంగా పరిశీలించి వాస్తవములను గ్రహించి,
పూర్తి చేయకుండా బిల్లులు చెల్లింపు జరిగితే, వారి మీద చర్యలు చేపట్టి వెంటనే ప్రజలకు ఉపయోగకరంగా ఆ భవనాలను పూర్తి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.