క్రిష్ణా జిల్లా మోపిదేవి మండలం స్టూడియో 10 టీవీ న్యూస్
ప్రాణాలు పోయేంత వరకూ పట్టించుకోరా…
ఆక్రమణలపై నోరు మెదపని రెవెన్యూ యంత్రాంగం…
ప్రాణాలు పోయేంతవరకూ పట్టించుకోరా అంటూ ప్రజలు రెవెన్యూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రెవెన్యూ యంత్రాంగం ఆక్రమణలపై నోరు మెదపకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
వివరాలలోకి వెళితే మోపిదేవి ప్రధాన సెంటర్ నుండి అవనిగడ్డ వెళ్లే దారిలో నాగాయతిప్ప అడ్డ రోడ్డు దాటిన దగ్గర నుండి జాతీయ ప్రధాన రహదారి వరకు పెద్ద స్థాయిలో ఆక్రమణలు జరుగుతున్నాయి. ఆక్రమణల విషయాన్ని ఎన్ని సార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించక పోవడంపట్ల పలు విమర్శలు వినవస్తున్నాయి.
ఈ ప్రదేశంలో ఆక్రమణలకు మంచి గిరాకీ ఏర్పడింది.ముందు వైపు *R&B* రహదారి ఉండగా,వెనుక వైపు డ్రైనేజీ ఉంది.రోడ్డును ఆనుకుని మార్జిన్ నుండి వెనుక వైపు డ్రైనేజీని పూడ్చి వేసి ఆక్రమణలు కొనసాగిస్తున్నారు.మోపిదేవి మండలంలోని అయోధ్య దగ్గర నుండి ఈ డ్రైనేజీ ఉంది.అధిక వర్షాలు కురిసినప్పుడు పంట పొలాలలోని మురుగు నీరు ఈ డ్రైనేజీ ద్వారానే దారి మల్లి పొలాలు ముంపునకు గురి కాకుండా ఉంటాయి.ఆక్రమణలు చేపట్టిన ప్రదేశాలలో ఆక్రమ దారులు డ్రైనేజీని సగం పైగా పూడ్చి వేసి కట్టడాలు చేపడుతున్నారు.డ్రైనేజీని పూచి నిర్మాణాలు చేపట్టడం వలన దిగువన గల పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడుతుంది.కట్టడాలు కూడా భారీగా నిర్మించడం వలన నిర్మాణాలు అకస్మాత్తుగా కూలిపోయే ప్రమాదం లేకపోలేదు.రోడ్డు అంచుకు ఆక్రమణలు నిర్మించడం వలన సంబంధిత షాపులకు వచ్చే వారు తమ వాహనాలు రోడ్డు పైనే ఉంచడం వలన రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్న విషయం అందరికీ విదితమే.
సంబంధిత విషయాలు రెవెన్యూ అధికారులు పరిగణలోకి తీసుకొని భారీ స్థాయిలో జరుగుతున్న ఆక్రమణలను నిలుపుదల చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.