క్రిష్ణా జిల్లా మోపిదేవి మండలం స్టూడియో 10 టీవీ న్యూస్
సిమెంటు ఇనుము* *మాయమైన ఘటనపై జిల్లా* *అధికారులు విచారణ.
మోపిదేవి మండలం కే కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు నేడు పనులకు సంబంధించి సిమెంటు, ఇనుము మాయమైన ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, సమగ్ర శిక్ష అభియాన్ ఏ ఎం ఓ ఆదివారం సాయంత్రం పాఠశాలకు విచ్చేసి విచారణ చేపట్టారు.
పాఠశాలకు ప్రభుత్వం నుండి సరఫరా కాబడిన సిమెంటు 174 బస్తాలు, ఇనుము నాలుగు టన్నులు కొరతగా ఉన్నట్లు విచారణలో గుర్తించడం జరిగిందని ఏఎంఓ ఆర్ శ్యాంసుందర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ తోట అజయ్, ఎంఈఓ 2 కే రాజకుమార్ ,పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు , పూర్వపు ప్రధానోపాధ్యాయులు ఏవి రమణ తదితరులు ఉన్నారు..