క్రిష్ణా జిల్లా నాగాయలంక మండలం స్టూడియో10 టీవీ న్యూస్
నాగాయలంక మండలంలో జనసేనకు ఎటువంటి ఇబ్బంది లేదు
–లంకె యుగంధర్, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి.
నాగాలంక మండల అధ్యక్షుడు ఆయన చింతా వెంకటేశ్వరావు తమ పార్టీని వీడు నందువల్ల తమ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని లంకె యుగంధర్ రావు జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస్ విభాగ కార్యదర్శి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఒక వ్యక్తి తన స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీ మారినంత చేత పార్టీ మండలంలో ఎటువంటి ఒడిదులుకులకు లోను కావడం జరగదని ఒక మండలాధ్యక్షుడు పార్టీ మారుతుంటే ఆ వ్యక్తి కి కప్పిన కండవా తప్ప వేరే కండువా ను వాడేటువంటి అవకాశం లేని చేరిక ఇది అసలు చేరికే కాదని ఎద్దేవా చేశారు.
ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా తమ పార్టీలో మత్స్యకార వికాస విభాగం అనే ఒక విభాగాన్ని మత్స్యకార సామాజిక వర్గం కోసం మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారని దాని ద్వారా తమ సామాజిక వర్గ ఇబ్బందులను అధిగమించడానికి మరియు అధికార పార్టీ దురాగతాలను ఎండగట్టి తమ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం చైర్మన్ బొమ్మిడి నాయకర్ గారి సారధ్యంలో నడుపుతున్నారని చింతా వెంకటేశ్వరరావు వైసీపీలో చేరినంత మాత్రాన మా పార్టీ నుండి ఒక వ్యక్తి కూడా వెళ్లలేదని కాబట్టి అది వారి పార్టీకి ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో ఆలోచించుకుంటే వారికే రాత్రికి నిద్ర పట్టదని అన్నారు.