రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈనెల 15వ తేదీన బుధవారం మెదక్ పట్టణంలో బహిరంగ సభలో పాల్గోనున్నారు.ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మెదక్ పట్టణంలో సిఎస్ఐ చర్చి గ్రౌండ్లో హెలిప్యాడ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గం ఇన్చార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి గారు,డీఎస్పీ పినిద్రా గారు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.