పంట దిగుబడి అంచనా సరిగ్గా వేయవచ్చని గణాంకాల అధికారి కృష్ణయ్య అన్నారు. శంకరంపేట్ ర మండలం చందంపేట్ గ్రామంలో ఆయన మం డల వ్యవసాయాధికారి కలసి తో గురువారం పంటకోత ప్రయోగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పొలంలో( సర్వే నెం 270/2, 5 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పు స్థలంలో పం టను కోసి, ఆ వచ్చిన ధాన్యం తూకం వేసి, పంట దిగుబడి అంచనా వేస్తామన్నారు. గ్రామ రైతు పలగల యాదగిరి పొలంలో పంటకోత ప్రయాగం చేయగా 13 కిలోలధాన్యం వచ్చిందన్నారు. ఈ ప్రయోగం ప్రకారం ఎకరాకు 11 నుంచి 13 క్వింటాళ్ల ధాన్యం వస్తుం దన్నారు. ఆయన వెంట తహిసీలుదార్, డివిసినల్ గణాంక అధికారి మండల గణాంక అధికారి వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.