తాడ్వాయి మండలం బీరెల్లి, ఎల్లాపూర్, కామారం మరియు ఆశన్నగూడెం గ్రామాల నుండి 50 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరిక…

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు..

మహిళలకు ఉచిత బస్ ప్రయాణం…

2 లక్షల రూపాయల రైతు రుణమాఫి…

వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నాయకులు…

పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ మరియు ములుగు నియోజక వర్గ కన్వీనర్ గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ గార్లు…

తేదీ: 07.11.2023 మంగళవారం అనగా ఈరోజున ములుగు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ గారి అధ్యక్షతన సహకార సంఘ సభ్యులు రమేష్ యాదవ్ మరియు మాజీ సహకార సంఘ మాజీ సభ్యులు జాజ శివ గార్ల ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ మరియు ములుగు నియోజక వర్గ కన్వీనర్ గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ గార్ల సమక్షంలో వివిధ పార్టీల నుండి విచ్చేసిన 50 మందికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా అశోక్ మరియు రాజేందర్ గౌడ్ గార్లు మాట్లాడుతూ సీతక్క గారు ప్రజా సమస్యల్లో నిత్యం పోరాటం చేస్తూ, ప్రజల కష్టాలను తీర్చాలని ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా అధికార పార్టీపై పోరాటం చేస్తూనే ఉన్నారని, నిత్యం ప్రజా కష్టాల్లో ప్రజలకు అండగా నిలబడి కరోనా కాలంలో, వరదల వల్ల నష్టపోయిన బాధితులకు సహాయం అందిస్తూ, ములుగు ప్రాంత సమస్యలపై పోరాడుతూనే ఉన్నారని అన్నారు. ప్రతి క్షణం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం శ్రమిస్తూ ఉన్నారని, అలాగే ఇప్పుడు అధికార పార్టీలో ఉండి అత్యున్నత పదవులు పొందిన వారు కూడా ప్రజల కష్టాలను పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికల సమయం రాగానే ఓట్ల కోసం నాటకాలాడుతు మోసం చెయ్యడానికి వస్తున్నారని అన్నారు. కరోనా సమయంలో కానీ, వరదల సమయంలో కానీ, వడ్ల కొనుగోలు విషయంలో కానీ ఏ రోజు ప్రజల్లోకి రాని నేతలు ఈ రోజు వచ్చి ఓట్ల కోసం డ్రామాలాడుతున్నారని అన్నారు. పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, గృహలక్ష్మి పథకం కోసం అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వాలని అన్నారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం వల్ల వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం గద్దెనెక్కి రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఇంటికో ఉద్యోగం, కేజీ టూ పీజీ ఉచిత నిర్భంద విద్య, దళితులకు 3ఎకరాల భూమి ఇస్తా అని, అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని నమ్మించి మోసం చేశారని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు చేరువయ్యాయని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరా జల ప్రభ ద్వారా బోర్లు, పంట రుణాలు, లక్ష రూపాయల రుణమాఫి, ఫీజ్ రీ ఇంబార్సుమెంట్, ఆరోగ్య శ్రీ, ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు, కల్వర్టులు, పాఠశాలలు, కళాశాలలు అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసిన వారికి అందరికీ నా తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ రోజు వివిధ పార్టీల నుండి 50 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని పార్టీ పోరాటాలలో భాగం అయినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఎల్లప్పుడూ అండగా నేను సీతక్క గారు ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!