*ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదర్వంలో “జగనన్న సురక్ష” సమీక్షా సమావేశం*
*చిట్టి గుండెకు గట్టి భరోసా “పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం” – ఎంపీ గురుమూర్తి*
తిరుపతి( స్టూడియో 10 న్యూస్ )
ఏపీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు.అని ఇందులో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్ రెండు ముఖ్యమైన కార్యక్రమాలమీద సమీక్షించారు. జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైనదని, వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చిందని జగన్ తెలిపారు. 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98శాతం, వార్డు సచివాలయాల్లో 77శాతం శిబిరాల నిర్వహణ పూర్తయ్యిందన్నారు.శిబిరాల్లో గుర్తించిన రోగులకు చేయూత నివ్వడం చాలా ముఖ్యమని కలెక్టర్లకు సీఎం జగన్ తెలిపారు.
తిరుపతి పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఇప్పటి వరకు 2వేల గుండె ఆపరేషన్లు పూర్తి చేశారని 96% శాతం సర్జరీలు విజయవంతం అయ్యాయని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పద్మావతి హృదయాలయం డాక్టర్లని, సిబ్బందిని అభినందించారు. పద్మావతి హృదయాలయం నిర్వహిస్తున్న వైద్య సేవల గూర్చి ఎంపీ గురుమూర్తి ముఖ్యమంత్రి గారికి వివరించారు.అనంతరం తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారద్యంలోని తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేసిందని ఆ బాటలోనే తిరుపతిలో చిన్న పిల్లల కోసం పద్మావతి హృదయాలయం నిర్మించి హృద్రోగంతో బాధపడుతున్న ఎందరో చిన్న పిల్లల జీవితాలలో వెలుగులు నింపారని ఆయన అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మారు మూల గ్రామాలలో కూడా మెడికల్ క్యాంప్లు నిర్వహిస్తున్నామని
జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావన్నారు. శిబిరాలు నిర్వహణ పూర్తయ్యాక అసలు పని మొదలవుతుందన్నారు. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు పూర్తిస్థాయిలో చేయూత నివ్వడం అన్నది అత్యంత ముఖ్యమైనదని,కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నయం అయ్యేంతవరకూ మనం చేదోడుగా నిలుస్తామన్నారు.ముందుగా ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడపడుతూ, అందరికీ పరీక్షలు నిర్వహించామని, ఆ పేషెంట్లను శిబిరానికి తీసుకురావడం, పరీక్షలు నిర్వహించడం, అక్కడ మందులు ఇవ్వడం జరుగుతోందన్నారు. అర్బన్ ఏరియాల్లో 91 శాతం, రూరల్ ఏరియాల్లో 94శాతం స్క్రీనింగ్ పూర్తయ్యిందన్నారు. 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తిచేశారని తెలిపారు. అలాగే 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారన్నారు.ఇప్పుడు జనగనన్న సురక్ష కార్యక్రమం చివరిదశలో ఉన్నామని, ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక యాప్‌ను మనం వాడుతున్నామని జగన్ తెలిపారు. క్యాంపులకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్య పరిస్థితులను యాప్ ద్వారా నమోదు చేస్తున్నామని కలెక్టర్లకు తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చికిత్సలు ఎక్కడ చేయించాలన్న దానిపై మన దగ్గర డేటా ఉందన్నారు.జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించాలని జగన్ ఆదేశించారు. ప్రతి వారం కూడా మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించాలన్నారు. నెలలో నాలుగు క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు.
ఐదు నెలల్లో మళ్లీ అదే గ్రామంలో క్యాంపు నిర్వహణ సమయం వస్తుందన్నారు. దీనివల్ల సంతృప్త స్థాయిలో సేవలు అందుతాయన్నారు. ఆరోగ్య పరంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి అవసరాలు తీర్చడం మన బాధ్యతన్నారు.అలాగే ఆరోగ్య శ్రీ సేవలు ఎలా పొందాలన్నదానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకూ ఈ ప్రచారం నిర్వహించాలన్నారు .డిసెంబర్ 1 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఆరోగ్య శ్రీని ఎలా పొందాలన్నదానిపై దానిపై ప్రతి ఒక్కరికీ తెలియాలన్నారు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఆరోగ్య శ్రీ యాప్ ఉండాలన్నారు. దిశ తరహాలోనే ప్రతి ఫోన్లో ఆరోగ్య శ్రీ యాప్ ఉండాలన్నారు. ఆరోగ్య శ్రీ చికిత్స కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయన్నారు. దీనిపై ఎలాంటి సందేహాలు ఎవ్వరికీ ఉండకూడదన్నారు. యాప్‌లోకి వెళ్తే సమీపంలోని ఎంపానెల్ ఆస్పత్రికి మార్గం చూపిస్తుందన్నారు. లేకపోతే విలేజ్ క్లినిక్‌ను అడిగినా, అలాగే 104ను అడిగినా తగిన రీతిలో గైడ్ చేస్తారన్నారు. ఆరోగ్య శ్రీ సేవలను ఎలా పొందాలన్నదానిపై బుక్‌లెట్స్‌కూడా ప్రతి కుటుంబానినీ అందిస్తారన్నారు.ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య సురక్షపై కలెక్టర్లకు జగన్ కీలక ఆదేశాలు-డిసెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు.ఏపీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జగనన్న ఆరోగ్య సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్ రెండు ముఖ్యమైన కార్యక్రమాలమీద సమీక్షించారు. జగనన్న ఆరోగ్య సురక్ష చాలా ముఖ్యమైనదని, వైద్య శిబిరాల నిర్వహణ దాదాపు చివరి దశకు వచ్చిందని జగన్ తెలిపారు. 10,032 గ్రామ సచివాలయాల్లో దాదాపు 98శాతం, వార్డు సచివాలయాల్లో 77శాతం శిబిరాల నిర్వహణ పూర్తయ్యిందన్నారు.
శిబిరాల్లో గుర్తించిన రోగులకు చేయూత నివ్వడం చాలా ముఖ్యమని కలెక్టర్లకు సీఎం జగన్ తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కింద నిర్వహించిన శిబిరాలు సాధారణ వైద్య శిబిరాలు కావన్నారు. శిబిరాలు నిర్వహణ పూర్తయ్యాక అసలు పని మొదలవుతుందన్నారు. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు పూర్తిస్థాయిలో చేయూత నివ్వడం అన్నది అత్యంత ముఖ్యమైనదని,కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి నయం అయ్యేంతవరకూ మనం చేదోడుగా నిలుస్తామన్నారు.
ముందుగా ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడపడుతూ, అందరికీ పరీక్షలు నిర్వహించామని, ఆ పేషెంట్లను శిబిరానికి తీసుకురావడం, పరీక్షలు నిర్వహించడం, అక్కడ మందులు ఇవ్వడం జరుగుతోందన్నారు. అర్బన్ ఏరియాల్లో 91 శాతం, రూరల్ ఏరియాల్లో 94శాతం స్క్రీనింగ్ పూర్తయ్యిందన్నారు. 1.44 కోట్ల కుటుంబాల్లోని వారికి ఇప్పటికే స్క్రీనింగ్ పూర్తిచేశారని తెలిపారు. అలాగే 6.4 కోట్ల ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారన్నారు.
ఇప్పుడు జనగనన్న సురక్ష కార్యక్రమం చివరిదశలో ఉన్నామని, ఇప్పటికే దీనికి సంబంధించిన ఒక యాప్‌ను మనం వాడుతున్నామని జగన్ తెలిపారు. క్యాంపులకు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలు తీసుకుంటున్నామని, వారి ఆరోగ్య పరిస్థితులను యాప్ ద్వారా నమోదు చేస్తున్నామని కలెక్టర్లకు తెలిపారు. ఈ సమాచారం ఆధారంగా తదుపరి చికిత్సలు ఎక్కడ చేయించాలన్న దానిపై మన దగ్గర డేటా ఉందన్నారు జనవరి 1 నుంచి క్రమం తప్పకుండా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహించాలని జగన్ ఆదేశించారు. ప్రతి వారం కూడా మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించాలన్నారు. నెలలో నాలుగు క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు.
ఐదు నెలల్లో మళ్లీ అదే గ్రామంలో క్యాంపు నిర్వహణ సమయం వస్తుందన్నారు. దీనివల్ల సంతృప్త స్థాయిలో సేవలు అందుతాయన్నారు. ఆరోగ్య పరంగా ఎవరికి ఏ అవసరం వచ్చినా వారి అవసరాలు తీర్చడం మన బాధ్యతన్నారు.అలాగే ఆరోగ్య శ్రీ సేవలు ఎలా పొందాలన్నదానిపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకూ ఈ ప్రచారం నిర్వహించాలన్నారు.
డిసెంబర్ 1 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు ఇవ్వాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ఆరోగ్య శ్రీని ఎలా పొందాలన్నదానిపై దానిపై ప్రతి ఒక్కరికీ తెలియాలన్నారు. ప్రతి ఒక్కరి ఫోన్‌లో ఆరోగ్య శ్రీ యాప్ ఉండాలన్నారు. దిశ తరహాలోనే ప్రతి ఫోన్లో ఆరోగ్య శ్రీ యాప్ ఉండాలన్నారు. ఆరోగ్య శ్రీ చికిత్స కోసం ఎక్కడకు వెళ్లాలన్నదానిపై పూర్తి వివరాలు ఈ యాప్‌లో ఉంటాయన్నారు. దీనిపై ఎలాంటి సందేహాలు ఎవ్వరికీ ఉండకూడదన్నారు. యాప్‌లోకి వెళ్తే సమీపంలోని ఎంపానెల్ ఆస్పత్రికి మార్గం చూపిస్తుందన్నారు. లేకపోతే విలేజ్ క్లినిక్‌ను అడిగినా, అలాగే 104ను అడిగినా తగిన రీతిలో గైడ్ చేస్తారన్నారు. ఆరోగ్య శ్రీ సేవలను ఎలా పొందాలన్నదానిపై బుక్‌లెట్స్‌కూడా ప్రతి కుటుంబానినీ అందిస్తారన్నారు.అలాగే నవంబర్ 9 నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ పేరిట కార్యక్రమం ఉంటుందని జగన్ తెలిపారు. ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచి గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల వారీగా ఎంత డీబీటీ ఇచ్చాం, ఎంతమంది ఎలా లబ్ధి జరిగింది అన్నదానిపై ప్రతి ఒక్కరికీ వివరాలు అందించాలన్నారు. గ్రామాల వారీగా ఏయే పథకాల ద్వారా లబ్ధిపొందారో చెప్పాలన్నారు. గ్రామాలవారీగా ఎంత మంచి జరిగిందో చెప్పాలని ఆదేశించారు. ఏ పథకం ఎలా పొందాలో వారికి తెలియాలన్నారు. ఒకవేళ ఎవరికైనా ఏమైనా అందకపోతే వారికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లో నాడు – నేడు ద్వారా వచ్చిన మార్పులు చెప్పాలని, ఆర్బీకేల్లాంటి వ్యవస్థతోపాటు, వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులు గురించి చెప్పాలని, పారదర్శకత ఏరకంగా పాటిస్తున్నామో చెప్పాలన్నారు.