మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి* తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే సత్తగల ఏకైక నాయకులు గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ కే ఉందని, కరోనా కష్టకాలంలో కూడా అన్ని సంక్షేమ పథకాలు యధావధిగా కొనసాగించారని మెదక్ బి ఆర్ ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంపేట మండల పరిధిలోని నస్కల్, నందగోపాల్ , నగరం తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు పద్మా దేవేందర్ రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికారు. పద్మా దేవేందర్ రెడ్డి రాకతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. డబ్బు చప్పులతో బోనాలు తీస్తూ దారి పొడవున పూలు చల్లుతూ స్వాగతం పలికారు. నగరం తండాలో గిరిజనుల సంప్రదాయ ఆటలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బి ఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను కొనసాగించిన ఘనత మన కేసీఆర్ కే ఉందన్నారు. కాంగ్రెస్ నాయకులకు కుర్చీలో కొట్లాటే ఉంటాది తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని అన్నారు. ఆ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి పంటల సాగుకు మూడు గంటల కరెంటు చాలు అంటే, ఉత్తంకుమార్ రెడ్డి రైతుబంధు బందు చేయాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 93 లక్షల తెల్ల కార్డు ఉన్న వారందరికీ బీమా పథకాన్ని ప్రవేశ పెట్టరున్నట్లు చెప్పారు. గిరిజనులతో కలిసి భోజనం
బిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ప్రజల కష్టసుఖాలు పాల్పంచడంలో ముందు ఉండడమే కాదు. వారు పెట్టే కారం, రొట్టెన పరమాన్నంగా భావించి భోజనం చేస్తారు. మంగళవారం నిజాంపేట మండల పరిధిలోని జెడ్ చెరువు తండాలో గిరిజనులు ‘ పద్మక్క’ వచ్చావా అంటూ ఆప్యాయంగా పలకరించారు. మధ్యాహ్న సమయం కావడంతో వారు తినే కారం,మక్కా రొట్టె ను తినాలని కోరారు. పద్మాదేవేందర్ రెడ్డి వారితో ముచ్చటిస్తూ భోజనం చేశారు. గిరిజనులు ప్రేమతో అందజేసిన కారం, రొట్టైనా పంచభక్ష పరమాన్నంగా భోజనం చేసి వారిచ్చిన నీళ్లనే తాగారు. పద్మక్క అంటే క్లాస్ లీడర్ కాదు…మాస్ లీడర్ అంటూ గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు