కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధికార ప్రతినిధిగా కత్తెరపెళ్లి భాస్కర్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్
తేదీ: 30.10.2023 సోమవారం అనగా ఈరోజున కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధికార ప్రతినిధిగా కత్తెరపెల్లి భాస్కర్ గారిని నియమిస్తూ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటూ, పార్టీ ఆదేశించిన ప్రతి పనినీ నీతి, నిజాయితీ, నిబద్ధతతో పూర్తి చేయాలని ఆశిస్తూ, ప్రతి పార్టీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.