- బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి
మెదక్ నియోజకవర్గంలో ని తెదేపా, బిజెపి , కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ లో చేరడంతో పార్టీ తిరుగులేని శక్తిగా మారిందని, అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదం తో హ్యాట్రిక్ విజయం సాధిస్తానని మెదక్ బి ఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. మెదక్ శాసనసభ్యురాలు,బీఆర్ స్ పార్టీ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి గారు సోమవారం ఉదయం ఇటీవలే గౌరవ బీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సమక్షంలో చేరిన తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఏకే.గంగాధర రావు గారిని తన నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి బీఆర్ఎస్ పార్టీలోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భం పద్మా దేవేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రం లో రైతుల అభ్యున్నతికి ,అన్ని రంగాలలో ప్రగతి పధంలో తీసుకువెళ్తున్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారి పాలన నచ్చి అన్ని వర్గాల ప్రజలు, నాయకులు కార్యకర్తలు పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. పూర్వపు రామాయంపేట మరియు మెదక్ నియోజకవర్గం లో మంచి పేరు ఉన్న సీనియర్ నాయకుడు,నాలుగు దశాబ్దాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన సీనియర్ నాయకుల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రాజు,గవ్వలపల్లి ఉప సర్పంచ్ రామిరెడ్డి మరియు ఏకే.రమేష్ చందర్ పాల్గొన్నారు.