సి-విజిల్ యాప్ ద్వారా ప్రతి ఒక్క పౌరుడు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయాలని , జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఓటర్ లను మభ్యపెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వాటిని లైవ్ ఫోటోలు, లైవ్ వీడియోలను సి – విజిల్ యాప్ ద్వారా తీసి పంపాలని తెలిపారు. సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదు లపై వంద నిమిషాలలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని, లైవ్ ఫోటోలు, వీడియోలను తీసేటప్పుడు, అప్లోడ్ చేసే సమయంలో జి.పి.ఎస్. ఆన్ లో ఉంచాలని, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆటోమేటిగ్గా లోకేషన్ నమోదు అవుతుందని, సభలు, సమావేశాల్లో విద్వేషపూరిత కామెంట్స్ చేసిన, పార్టీ అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు లాంటి వివరాలను, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించిన, ఇతర ఎన్నికల ఉల్లంఘనలపై లైవ్ ఫోటోలు, వీడియోలు సి – విజిల్ యాప్ ద్వారా పంపాలని సూచించారు.
యువత సి-విజిల్ యాప్ ను ఉపయోగించి ఎన్నికల్లో జరిగే అక్రమాలను, ఉల్లంఘన లను తమ దృష్టికి తీసుకుని రావాలని, 24 గంటలు కలెక్టరేట్ కార్యాలయంలోని సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రం నుండి సి-విజిల్ యాప్ ఫిర్యాదులపై పర్యవేక్షణ చేయడం జరుగుతున్నదని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్ నెంబర్ లను గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు. సి-విజిల్ యాప్ ను తమ ఫోన్ లలో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను అప్లోడ్ చేయాలని, సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, వంద నిమిషాలలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మెదక్ చే జారీ చేయనైనది.