- ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో పార్టీలో చేరిన 150 మంది కార్యకర్తలు
ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఆదివారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షులు శేరి పరమేశ్వర్ రెడ్డి, వార్డు సభ్యులు బోయిన్ పల్లి అశోక్, మాజీ వార్డు సభ్యులు ఆర్ల శ్రీశైలం ఆధ్వర్యంలో దాదాపు 150 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ బిఅర్ఎస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టిఆర్ఎస్ అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బెంది శ్రీనివాస్ రెడ్డి, శేరి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ సాయి ప్రసాద్ యాదవ్, నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..