చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండలం గేట్ వనంపల్లి,కడిచేర్ల, మాదారం,మీనపల్లి కలన్,
ఆర్కథల, యావపుర్ గ్రామాలలో ప్రజా ఆశీర్వాదయాత్ర పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు..
గేట్ వనంపల్లి,కడిచేర్ల, మాదారం,మీనపల్లి కలన్, ఆర్కథల, యావపుర్ గ్రామాల్లో మంగళహారుతులతో స్వాగతం పలికిన మహిళలు..
పెద్దఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు, యాదన్న అభిమానులు.
పల్లెపల్లెన ప్రభుత్వ పథకాల ప్రచారం
బిఆర్ఎస్ పార్టీతోనే సంక్షేమం అభివృద్ధి…
చేవెళ్లలో మళ్ళీ బిఆర్ఎస్ జండా ఎగరవేస్తాం: ఎమ్మెల్యే కాలే యాదయ్య గారు
చేవెళ్ల నియోజకవర్గం నవాబ్ పేట్ మండలం లోని
గేట్ వనంపల్లి,కడిచేర్ల, మాదారం,మీనపల్లి కలన్,
ఆర్కథల, యావపుర్,గ్రామాల్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. గ్రామ గ్రామాన ఎమ్మెల్యే యాదన్న కు మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లో కాలి నడకన వీధివిది తిరుగుతూ గ్రామస్తులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరును అడిగి
తెలుసుకున్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో చిన్నా పెద్ద తేడా లేకుండా భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఎమ్మెల్యే యాదన్న వివరించారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతు…
ఎన్నికలు ఇంకో నెల మాత్రమే ఉండడంతో ఇప్పుడు యువత అంతా ఏకమై కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఒక్క నెల నాకోసం కష్టపడండి ఐదు సంవత్సరాలు మీకోసం కష్టపడతానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదల నుంచి నేటి వరకు బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ప్రజల కోసమే అహర్నిశలు కృషి చేశారు అన్నారు. కేసిఆర్ తెలంగాణ ప్రజల కోసం ఆలోచించి ప్రతి ఇంటికి ఐదు లక్షల బీమా చేపిస్తూ తెలంగాణ ప్రజలకు ధీమాగా ఉన్నారని అన్నారు. ఈ పది సంత్సరకాలంలో నుంచి కెసిఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాల అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని కుటుంబాలన్నిటికీ ఉచితంగా ఐదు లక్షల బీమా చేయించడం చాలా గొప్ప విషయం అన్నారు.
బిఆర్ఎస్ మేనిఫెస్టో పేద మధ్యతరగతి కుటుంబాల కోసమే ఆలోచించి రూపొందించామని, దేశంలోనే ఎక్కడ లేని విధంగా 24 గంటల ఉచిత కరెంటు రైతులకు అందించి రైతు పక్షపాతిగా నిలిచిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు.
కాంగ్రెస్ కొత్తగా తీసుకువచ్చిన మేనిఫెస్టోను ప్రజలు ఎవరు నమ్మడం లేదని అన్నారు. కాంగ్రెస్ ను నమ్మితే ప్రజలు ఆగమైపోతారని అన్నారు. నిన్న మొన్న కర్ణాటకలో జరిగిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన సౌభాగ్య లక్ష్మి పథకానికి విశేష స్పందన వస్తుందని అన్నారు.గతంలో బిఆర్ఎస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టో ప్రతి ఒక్కటి అమలు చేసిందని, అందుకే ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బిఆర్ఎస్ వైపే ఉన్నారని రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై మరోసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించి కెసిఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారని అన్నారు.ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ నీళ్లు ఇచ్చిన గొప్ప ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు..