*హైవే రహదారుల పై నిరంతర నిఘా ఉంచి పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలి.జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్*
*అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ప్రజలు వుండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఉపేక్షించేది లేదు.*
*గ్రామాల్లో నిరంతరం పర్యటించి గ్రూపు తగాదాలు లెకుండా చూడాలి..సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్న వాటిని అక్కడక్కడే పరిష్కరించాలి.*
*ఫిర్యాదిదారులకు, బాధితులకు ఎల్లప్పుడూ పోలీస్ స్టేషన్ అండగా నిలవాలి.*
*క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి, ఫిర్యాదు దారులతో ఆత్మీయంగా, హుందాగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలి.*
పాకాల ( స్టూడియో 10 న్యూస్ )
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వార్షిక తనిఖీలలో భాగంగా శనివారం జిల్లా ఎస్పి శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు తిరుపతి జిల్లా లోని పాకాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి ఎస్.హెచ్.ఓ. మరియు సిబ్బంది యొక్క పనితీరును సమీక్షించి జనరల్ డైరీ, కేసు డైరీ, కోర్టు క్యాలెండర్ వంటి పలు రికార్డులను తనిఖీ చేసి పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నందు పెండింగ్లో ఉన్న కేసులను సకాలంలో దర్యాప్తు పూర్తి చేసి బాధితులకి సరైన న్యాయం చేసి, సైబర్ నేరాల పట్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి త్వరిత గతిన పూర్తి చేయాలనీ, మహిళా సంభందిత నేరాల పట్ల వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు.
పాకాల పోలీస్ స్టేషన్ పరిధి గుండా ఎక్కువగా జాతీయ రహదారులు వెళుతున్నందున నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు ప్రత్యేక కార్యచరణ చేపట్టి, ప్రమాదకరమైన మలుపులు, రోడ్ క్రాసింగ్ లను గుర్తించి అక్కడ సూచిక బోర్డులను, హెచ్చరించే సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలన్నారు. ఆకస్మికంగా వాహనాల తనిఖీలను నిర్వహించి, ఎర్ర చందనం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాన్ని అరికడుతూ, అలాగే హైవే పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం రహదారి యందు తిరుగుతూ నేరాలు జరగకుండా నివారించాలన్నారు. పాకాల స్టేషన్ పరిధిలో గల కేడీలు, బీసీలు, డిసీలు, పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై ప్రత్యేకమైన నిఘా ఉంచుతూ, పోలీస్ స్టేషన్ పరిధిలో నేర నివారణ చేయుటకు బీట్ సిస్టంను మరింత మెరుగుపరచాలన్నారు.
ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల యందు మద్యపానం సేవించకుండా అరికట్టడానికి ప్రత్యేక భద్రతా దళాలతో పెట్రోలింగ్ చేయాలి. పాకాల జంక్షన్ రైల్వే స్టేషన్, ఊట్ల వారి పల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాల నుండి హైవే రహదారుల వరకు నిరంతరం గస్తీ కాచుటకు బ్లూ colts, బీట్ సిస్టంను బలోపేతం చేసి, మరింత సమర్థవంతంగా పనిచేసి నేర నివారణ చేయాలని ఆదేశించారు. పాకాల పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారుల యొక్క ఫిర్యాదులను స్వీకరించి చిన్న సమస్యగా ఉన్నప్పుడే ఇరుపక్షాలను పిలిపించి, వారితో మాట్లాడి పరిష్కరించి, ఎటువంటి నేరం జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు పాకాల పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమావేశమై వారి సాధకబాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ క్రమశిక్షణతో అలసత్వం ప్రదర్శించకుండా,ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా విధుల యందు మానవతా దృక్పథంతో నిక్కచ్చిగా ఉండి, స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తిస్తూ వారికి మేమున్నామనే ధైర్యాన్ని ఇచ్చి ఫిర్యాదిదారులకు భరోసా ను కల్పించాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గల మహిళా సంరక్షణ కార్యదర్శుల పనితీరుని సమీక్షించిన పిమ్మట వారితో మాట్లాడుతూ నేటి సమాజంలో గృహ నిర్బంధ మహిళ సంబంధిత విషయాలను, బాలికలు ఎదుర్కొంటున్న ఈవ్ టీజింగ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మరియు పోక్సో చట్టం వంటి విషయాల గురించి సంబంధిత విద్యా సంస్థలు, పారిశ్రామిక ప్రాంతాల యందు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేసి, కళాశాల, పాఠశాలల్లో బాలికల పట్ల ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తన గురించి విద్యార్థులతో మాట్లాడి తెలుసుకొని ఏదేని అనుకోని సంఘటనలు జరిగి ఉంటే తమ ఎస్.హెచ్.ఓ. గారికి తెలియపరచాలన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి డిఎస్పి యశ్వంత్, సిఐ లు చంద్రశేఖర్ పిళ్ళై డి.సి.ఆర్.బి, ఓబులేష్ పాకాల, ఎస్ఐ లు మరియు పాకాల పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.