*ఉప్పరపల్లి గ్రామపంచాయతీ లో జగనన్న సురక్ష కార్యక్రమం*
*ఉచిత వైద్య పరీక్షలతో పాటు ఉచిత వైద్యం- పాకాల ఎంపీడీవో ప్రభాకర్*
*ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ఆర్. జగన్మోహన్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంకల్పం ఉప్పరపల్లి సర్పంచ్ గౌరీ శంకర్*
పాకాల
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల మండలంలోని ఉప్పరపల్లి సచివాలయం నందు జగనన్న సురక్ష కార్యక్రమం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా నిర్వహించాలని సూచించారని ఎంపీడీవో ప్రభాకర్ తెలిపారు ప్రతి ఒక్కరికి ఆరోగ్య రక్ష- జగనన్న సురక్ష అందులో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాకాల మండలం పరిధిలోని ఉప్పరపల్లి గ్రామపంచాయతీ సచివాలయం నందు గురువారం ఉదయం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుకు సంబంధించిన ప్రజలకు ఆరోగ్య సురక్ష క్యాంపులో పాల్గొని అన్ని పరీక్షలు చేయించుకుంటున్నారు అని తెలిపారు ఈ సందర్భంగా ఉప్పరపల్లి సర్పంచ్ గౌరీ శంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ఈ జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రతి ఇంటికి వాలంటీర్లు,ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది వచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండేందుకు ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంకల్పం అని తెలియజేశారు. ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఉంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్య సురక్ష శిబిరంలో వచ్చి వైద్యము పొందవచ్చు అని తెలిపారు. వైద్యం కోసం పేదవాళ్లు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదని, ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ లో పాల్గొని అన్ని పరీక్షలు చేయించుకుని, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి అవసరమైన చికిత్స అందిస్తామని తెలిపారు.
జగనన్న ఆరోగ్య వైద్య శిబిరాలు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్య సురక్ష శిబిరంలో గురువారం నిర్వహించిన క్యాంపులో ఉప్పరపల్లిలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. వీరందరికీ జగనన్న ఆరోగ్య సురక్ష కింద ఉచితంగా మందులు పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పార్టీ నాయకులు కార్యకర్తలు ఏఎన్ఎం ఆశా వర్కర్ వాలంటీర్స్ గ్రామస్తులు పాల్గొన్నారు