పదేండ్లు ఎమ్మెల్యే గా ఉన్న పద్మారెడ్డి…నియోజక వర్గ అభివృద్ధిని 20 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లింది

  • కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో ప్రజల నుండి విశేషమైన స్పందన
  • కార్యాలయాలు, కళాశాలలే కాకుండా జింకలను సైతం తీసుకెల్ళిన ఘనత ఎమ్మెల్యేది
  • ఓట్ల కోసం అవినీతి సామ్రాజ్యం డబ్బు సంచులతో బయల్దేరనుంది
  • 25 ఏండ్ల వయస్సులో ఎమ్మెల్యే పద్మ రామాయంపేటలో జడ్పీటీసిగా పోటిచేశారు
  • నా వయస్సు గురించి మాట్లడడం సిగ్గుచేటు
  • డబ్బుకు అమ్ముడుపోయిన నేతలు మైనంపల్లి కుటుంబాన్ని విమర్శించడం హాస్యాస్పదం
  • అవినీతి సామ్రాట్ యోధుడు ఎమ్మెల్యే భర్త. దేవేందర్ రెడ్డి జనం మధ్య ఎందుకు రావడం లేదు
  • అవినీతి డొంక కుప్పకూలనుందని భయంతో ఎమ్మెల్యే భర్త. దేవెందర్ రెడ్డి ని ఆ పార్టీ కార్యాలయంలో బంధించారు
  • మెదక్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. మైనంపల్లి రోహిత్ రావ్
    ……………………………………………………
    అధికార పార్టీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి భర్త. దేవేందర్ రెడ్డిని ఆ పార్టీ కార్యాలయంలో ఎందుకు బంధించారని… అవినీతి సామ్రాట్ యోధుడు గా పేరు గఢించిన దేవేందర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ ప్రచారంలో ఎందుకు కనబడడం లేదని మెదక్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. మైనంపల్లి రోహిత్ రావు ప్రశ్నించారు. బుధవారం మెదక్ మండలంలోని ఖాజిపల్లి, పాశాపూర్, వెంకటాపూర్, వెంకటాపూర్ తాండ, గుట్టకింది పల్లి, శివ్వాయిపల్లి, శివ్వాయిపల్లి తాండాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు. ఖాజీపల్లిలో ప్రారంభమైన ప్రచారానికి డా. మైనంపల్లి రోహిత్ కు అడుగడున జనం హారతులు, నిరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో మెదక్ మండల పార్టీ అధ్యక్షులు శంకర్, మాజీ సర్పంచ్ మార్గం నాగరాజు, ఎంపిటీసీలు సిద్దాగౌడ్, శ్రీహరి, ప్రభాకర్, పేరూర్ అనిల్, క్రిష్ణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హఫీజ్ మోల్ సాబ్, చింట్, యాదగిరి లతో పాటు తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్బంగా డా. మైనంపల్లి రోహిత్ రావ్ మాట్లాడుతూ పదేండ్లుగా ఎమ్మెల్యేగా మెదక్ నియోజక వర్గ ప్రజలు గెలిపించిన పద్మా రెడ్డిని నియోజక వర్గ అభివృద్ధిని పూర్తిగా 20 ఏండ్లు గా వెనక్కి తీసుకెల్ళిందని ఆయన విమర్శించారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలను దాదాపు 18 కార్యాలయాలను పక్క జిల్లా సిద్దిపేటకు తరలించడం సిగ్గుచేటు అని అన్నారు. సొంత నియోజక వర్గంలోని కార్యలయాలను పక్క నియోజక వర్గంకు తరులుతుంటే చూసిచూడనట్టుగా వ్యవహరించడమే కాకుండా దగ్గర ఉండి మరి ఆ కార్యాలయాలను తరలించడం హేయమైన చర్య అని ఆయన విమర్శించారు.
    వయస్సు గురించి మాట్లాడడం సిగ్గుచేటు…
    25 ఏండ్ల వయస్సు ఉన్నప్పుడు నేటి ఎమ్మెల్యే పద్మా రెడ్డి రామాయంపేట మండల జడ్పీటీసిగా ఏ అనుభవంతో… ఏ అర్హతతో ఎన్నికల్లో నిలబడ్డారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. మైనంపల్లి రోహిత్ రావు ప్రశ్నించారు. వయస్సు గురించి మాట్లాడడం సిగ్గుచేటు తనం అని ఆయన అన్నారు. నిన్నా మొన్న డబ్బుకు అమ్ముడుపోయిన నాయకులు మైనంపల్లి కుటుంబాన్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు.
    అవినీతి సామ్రాట్ యోధుడు దేవేందర్ రెడ్డి ఎక్కడా…?
    అవినీతికి చిరునామ అయినటు వంటి స్థానిక ఎమ్మెల్యే పద్మ రెడ్డి భర్త. దేవేందర్ రెడ్డి… నీతి మంతున్ని అని… సాక్ష్యాత్తు ఏడుపాయల దుర్గమ్మ దేవాలయం వద్ద పచ్చిబట్టలతో ప్రమాణం చేసిన దేవేందర్ రెడ్డి… బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మా రెడ్డి తరుపున ఎందుకు ప్రచారం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రచారంలోకి వస్తే వారి అవినీతి డొంక కుప్పకూలతుందని భయంతే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయనను బంధించారని ఎద్దేవ చేశారు.
    200 మంది బిఆర్ఎస్, బిజేపి కార్యకర్తల చేరిక…
    కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. మైనంపల్లి రోహిత్ రావు స్వచ్ఛంద సంస్థ ద్వారా చేసినటు వంటి పలు కార్యక్రమాలను చూసి డా. మైనంపల్లి రోహిత్ గారి సమక్షంలో మెదక్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు బిజేపి పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారుగా 200 మంది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోని చూసుకునే కుటుంబం మైనంపల్లిది అని ఆయన అన్నారు. అనంతరం పార్టీలో చేరిన వారు మాట్లాడుతు అహర్నిశలు కృషి చేయడమే కాకుండా, నిద్రాహారాలు మాని మైనంపల్లి రోహిత్ ను గెలిపించుకోని… మెదక్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయం అని వారు స్పష్టం చేశారు.
Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!