-చేవెళ్ల నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన అభ్యర్థి భీం భరత్
వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన తంగడపల్లి, మల్కాపూర్ నాయకులు
చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టపడి పని చేయాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం భరత్ అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యాలయంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని తంగడపల్లి, మల్కాపూర్ గ్రామాల నుంచి వివిధ పార్టీల చెందిన దాదాపు 150 మంది కాంగ్రెస్ అభ్యర్ధి పామెన భీం భరత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పని చేయాలన్నారు. చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని,పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. నెల రోజులు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడితే ప్రజలకు, రైతులకు, నాయకులకు ఎంతోమేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి, చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజా ఆగిరెడ్డి, PACS చైర్మన్లు దేవర వెంకట్‌రెడ్డి, గోనె ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, పడాల రాములు, మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్‌రెడ్డి, పీసీసీ సభ్యులు జనార్దన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు పడాల ప్రభాకర్, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు రెడ్డిశెట్టి మధుసూదన్‌గుప్తా,ex ఉపసర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జూకన్నగారి శ్రీకాంత్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు దేవర సమతారెడ్డి, వార్డు సభ్యులు మల్గారి మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షులు బండారి వెంకట్ రెడ్డి, PACS డైరెక్టర్ పైండ్ల మధుసూదన్ రెడ్డి, నాయకులు ప్రభాకర్, పాండు, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ గుడుపల్లి పెంటారెడ్డి, ఓబీసీఎల్ ప్రెసిడెంట్ సూర్యాపేట శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకుడు మద్దెల శ్రీనివాస్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.