గోవిందరావుపేట మండల కేంద్రంలోని బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క
తేదీ: 22.10.2023 ఆదివారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల కేంద్రంలో బతుకమ్మ పండుగ సందర్భముగా జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క గారు పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిపాడారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక, ఆడపడుచుల పండుగ, ప్రకృతిలో దొరికే అందమైన పూలతో తయారు చేసే పూల పండుగ బతుకమ్మ అని అన్నారు. అలాగే బతుకమ్మ పండుగ అంటేనే మహిళల పండుగ అని అన్నారు. ప్రకృతిలో దొరికే అందమైన పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను పసుపుతో చేసి ఆటపాటలతో గౌరమ్మను ప్రతి గ్రామంలో పూజించి, గౌరమ్మను గంగమ్మతో కలిపి ప్రతి ఏటా వర్షాలు సమృద్దిగా కురిసి, పంటలు బాగా పండాలని, పాడి పంటలు అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ సిరి సంపదలతో తుల తూగాలని గౌరమ్మను, గంగమ్మను పూజించే పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. తెలంగాణ ప్రజల అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.