Reporter -Silver Rajesh Medak.*చెక్ పోస్టులను తనిఖీ చేసిన జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ. ఎస్.మహేందర్ గారు**సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లా చెక్ పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు* జిల్లా ఎస్పీ శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లా చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను చేపట్టడం జరుగుతుందని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ.ఎస్. మహేందర్ గారు అన్నారు. అక్రమంగా ఎవరైనా ఎలాంటి ఆధారాలు లేని నగదు కానీ మద్యం మరియు మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లాలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈరోజు హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పోచమ్మరాల్ చెక్పోస్ట్ మరియు రామంపేట పోలీస్ స్టేషన్ పరిధి దామరచెరువు వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టులను సందర్శించి అక్కడ విధులలో ఉన్న అధికారులు,సిబ్బందికి తగు సూచనలు చేశారు.జిల్లా పోలీసు ఉన్నతాధికారి మెదక్ జిల్లా