ఓటరు చైతన్య రథం జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా
100 శాతం ఓటింగ్ లక్ష్యం ,
సాధారణ ఎన్నిక లో బాగంగా స్థానిక కలెక్టర్ కార్యాలయం ఓటరు చైతన్య రథం ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమం లో మాట్లాడుతూ జిల్లా లో రెండు నియోజక వర్గాల్లో ఓటరు చైతన్య రథం వచ్చి ప్రచారం చేస్తుందని .100 శాతం ఓటింగ్ లక్ష్యం గా ప్రచారం చేస్తుందని తెలిపారు.”నేను కచ్చితంగా గా ఓటు వేస్తాను “అనే నినాదం తో ప్రజలు అందరూ ఓటింగ్ లో భాగస్వామ్యం కావాలని పిలపునిచ్చారు , ఓటరు చైతన్య రథం జిల్లా లో 44 రోజుల గా అంటే తేదీ 17-10-2023 నుంచి 28- 10 – 2023 వరకు ప్రధాన కూడళ్లు,మార్కెట్స్, బస్ స్టాండ్ లు, జాతరలు,షాపింగ్ మాల్స్,కాలనీలో,తండలలో ప్రచారం చేస్తుందని , తెలంగాణ సంస్కతిక శాఖ కళా కారులు అట పాట లతో ప్రజలకు చైతన్యం కల్గించాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎన్నిక అధికారి మరియు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ రమేష్,జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, Dproఏడుకొండలు,కళా కారులు తదితరులు పాల్గొన్నారు.